ప్రియుడితో జాన్వీ కపూర్

  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్
  • దీపావళి వేడుకలకు హాజరైన జాన్వీ, ఆమె ప్రియుడు అక్షత్
  • ఇద్దరూ విడిపోయినట్టు కొంత కాలం క్రితం వార్తలు
Jahnvi Kapoor with boy friend

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు తన అందచందాలతో కుర్రకారు హార్ట్ బీట్ పెంచుతోంది. ఈ యంగ్ బ్యూటీ ప్రైవేట్ లైఫ్ కి చెందిన వార్తలు కూడా బీటౌన్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. తాజాగా తన బాల్య మిత్రుడు, రూమర్డ్ బోయ్ ఫ్రెండ్ అక్షత్ రాజన్ తో కలిసి ఉన్న ఫొటోలను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. టెన్సెల్ విల్లాలో దీపావళి వేడుకల సందర్బంగా వీరు ఈ ఫొటోలు దిగారు. 

ఈ సెలెబ్రేషన్స్ కు అనిల్ కపూర్, అన్షులా కపూర్, ఆకాన్ష కపూర్, సారా అలీ ఖాన్, న్యాసా దేవగణ్, తదితరులు హాజరయ్యారు. ఒక అందమైన లెహెంగా ధరించి ఈ కార్యక్రమానికి జాన్వీ హాజరయింది. మరోవైపు జాన్వీ, అక్షత్ ఇద్దరూ విడిపోయారంటూ కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ మళ్లీ కలిసిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

More Telugu News