శ్రీకాకుళం జిల్లాలో విష ప్రయోగానికి 40 కోతుల బలి
- కవిత మండలం శిలగం ప్రాంతంలో వెలుగులోకి
- కేసు నమోదు చేసిన అటవీ అధికారులు
- ఐదు రోజుల్లో రానున్న పోస్ట్ మార్టమ్ నివేదిక
అటవీ అధికారులు అక్కడికి చేరుకుని వాటిని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టమ్ పూర్తయిందని ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని కాశీబుగ్గ అటవీ అధికారి మురళీకృష్ణ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ‘‘జిల్లాలో ఈ తరహా ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎవరో కానీ ట్రాక్టర్ లో కోతులను తీసుకొచ్చి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. సుమారు 40-45 కోతులు మరణించాయి’’అని మురళీకృష్ణ తెలిపారు.