హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి: అసదుద్దీన్ ఒవైసీ

  • కర్ణాటకలోని బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్య
  • అసద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత షెహజాద్
  • ఎంఐఎం అధినేతగా హిజాబ్ ధరించిన మహిళ ఎప్పుడు ఉంటుందని ప్రశ్న
Want to see a woman wearing hijab as India Prime Minister says Asaduddin Owaisi

హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న జరగనున్న బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది. 

పార్టీ అధినేత మంగళవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిజాబ్ గురించి ప్రస్తావించారు. హిజాబ్ ధరించిన ఓ ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. అయితే, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ వ్యాఖ్యలపై ఒవైసీపై విరుచుకుపడ్డారు. ఎంఐఎం పార్టీ అధినేతగా హిజాబ్ ధరించిన మహిళ ఎప్పుడు ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

More Telugu News