Bollywood: హిట్ టాక్ తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

Akshay Kumar Ram Setu film opens with a bang rakes in Rs 15 crore
  • మంగళవారం విడుదలైన అక్షయ్ తాజా సినిమా
  • మొదటి రోజు దేశ వ్యాప్తంగా రూ. 15.25 కోట్లు వసూలు
  • వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అక్షయ్ కుమార్ ఖాతాలో విజయం
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాతో ఎట్టకేలకు విజయం ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం మంగళవారం విడుదలైంది. ఊహించినట్లుగానే ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. తొలి రోజు దాదాపు రూ. 15.25 కోట్లు వసూలు చేసింది. మంగళవారమే విడుదలైన అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా ‘థాంక్స్ గాడ్’ చిత్రానికి ‘రామ్ సేతు’ గట్టి పోటీ ఇచ్చింది. దీపావళి ఉత్సాహం, పండగ సెలవు కూడా రామ్ సేతుకు ఉపయోగపడింది. శ్రీరాముడు గురించి, రాముడు నిర్మించిన రామసేతు ఇతివృత్తం సినిమా కావడంతో హిందువుల ఆదరణ లభించింది. రాజస్థాన్ లో రూ. కోటికి పైగా వసూళ్లు రాగా, యూపీ, బీహార్, గుజరాత్, సౌరాష్ట్ర మార్కెట్‌లలో మంచి వసూళ్లు సాధించింది.

‘బ్రహ్మాస్త్ర’ తర్వాత రామ్ సేతు ఈ సంవత్సరంలో రెండవ అతిపెద్ద ఓపెనింగ్‌ను కూడా సాధించడం విశేషం. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచాతో పాటు తెలుగు యువ నటుడు సత్యదేవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది యాక్షన్-అడ్వెంచర్ డ్రామా. రామసేతు పురాణమా లేదా వాస్తవమా అనే విషయాన్ని పరిశోధించే పురావస్తు శాస్త్రజ్ఞుడి పాత్రలో అక్షయ్ నటించారు. ఈ చిత్రాన్ని అక్షయ్‌కి చెందిన కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Bollywood
Akshay Kumar
new movie
Ram Setu
15cr
opening

More Telugu News