Tammareddy: వెయ్యి కోట్లు రాబడితే అది చిరూ ఇమేజ్ కి తగిన సినిమా అని అర్థం: తమ్మారెడ్డి భరద్వాజ

  • ప్రముఖ దర్శక నిర్మాతగా ఉన్న తమ్మారెడ్డి 
  • తెలుగు సినిమా పోకడలపై స్పందన 
  • బడ్జెట్ భారీగా పెంచేస్తున్నారంటూ వ్యాఖ్య 
  • హీరో ఇమేజ్ కి తగిన కంటెంట్ ఉండాలనే అభిప్రాయం 
Tammareddy Bharadvaja Interview

సీనియర్ దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి మంచి పేరు ఉంది. తెలుగు సినిమా పోకడలపై ఆయన ఎప్పటికప్పుడు తన మనసులో మాటను చెబుతూనే ఉంటారు. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెరుగుతున్న తెలుగు సినిమా బడ్జెట్ ను గురించి ప్రస్తావించారు. బడ్జెట్ ను పెంచుతూ వెళుతున్న మేకర్స్ పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. 

తమ్మారెడ్డి మాట్లాడుతూ .. "ఇటీవల వచ్చిన 'కార్తికేయ 2' .. రీసెంట్ గా వచ్చిన 'కాంతార' 16 కోట్లతో నిర్మించిన సినిమాలు. తక్కువ బడ్జెట్ తో నిర్మించడం వలన, హిట్ టాక్ తో ఆ సినిమాలు ఎక్కువ లాభాలను అందుకున్నాయి. అదే భారీ బడ్జెట్ తో ఆ సినిమాలను నిర్మించి ఉంటే ఈ స్థాయి లాభాలు కనిపించేవి కావు. 30 కోట్ల సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టేసి, ఆ స్థాయి వసూళ్లు రాలేదంటే ఎలా? అన్నారు. 

" ఏ హీరోతో ఏ కంటెంట్ సినిమాను తీయాలి? ఆ హీరోకి గల ఇమేజ్ ఎంత? ఆ హీరోపై ఎంత వస్తుంది? అనేది చూసుకుంటూ వెళ్లాలి. చిరంజీవితో ఈ సినిమా చేశాం .. ఇంత వస్తే చాలనుకుంటున్నారు. నిజానికి చిరంజీవికి హీరోగా వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉంది. ఆయన ఇమేజ్ కి తగిన సినిమా చేస్తే ఆ వసూళ్లు తప్పకుండా వస్తాయి. అలా కలెక్ట్ చేసిన సినిమానే చిరంజీవి ఇమేజ్ కి తగిన సినిమాగా నేను భావిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News