Mumbai Court: అమ్మాయిని ‘ఐటెమ్’ అని పిలిచిన యువకుడు.. ఏడాదిన్నర జైలు శిక్ష విధించిన కోర్టు

  • తనను ‘ఐటెమ్’ అని పిలిచి లైంగికంగా వేధించాడంటూ కోర్టుకెక్కిన బాలిక
  • అమ్మాయిలను అబ్బాయిలు ఇలా ఉద్దేశపూర్వకంగానే పిలుస్తారన్న కోర్టు
  • నిందితుడి విషయంలో కనికరం చూపాల్సిన పనిలేదంటూ శిక్ష
Mumbai man gets one and half year jail for calling girl item

అమ్మాయిని ‘ఐటెమ్’ అని పిలిచిన ఓ యువకుడు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. కోర్టు అతడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. ముంబైలో జరిగిన ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్ల యువకుడు తనను లైంగికంగా వేధించాడంటూ 16 ఏళ్ల బాలిక 2015లో కేసు పెట్టింది. 14 జులై 2015న తాను స్కూలు నుంచి ఇంటికెళ్తున్న సమయంలో యువకుడు తనను బైక్‌పై వెంబడించాడని, ఆ తర్వాత జుట్టు పట్టుకుని లాగుతూ.. ‘క్యా ఐటెమ్ కిదర్ జా రహీ హో’ (ఏం ఐటెమ్.. ఎక్కడికెళ్తున్నావ్?) అని వేధించాడని ఆరోపించింది.

విచారణ చేపట్టిన పోక్సో కోర్టు.. అమ్మాయిలను లైంగికంగా వేధించేందుకు అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అలా పిలుస్తారని పేర్కొంది. ఇలాంటి రోడ్‌సైడ్ రోమియోలకు బుద్ధి చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించింది. నిందితుడి విషయంలో కనికరం చూపించే ప్రసక్తే లేదని పేర్కొంటూ ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.

More Telugu News