మా తాత సంపాదించిన ఆస్తిని అలా పోగొట్టాను: సీనియర్ నటుడు

  • నిన్నటితరం హీరోగా నరసింహారాజు 
  • ఆస్తులు పోగొట్టానంటూ చెప్పిన నటుడు 
  • పిల్లలు సంపాదనపరులంటూ హర్షం 
  • తాము చేసుకున్న పుణ్యమంటూ వ్యాఖ్య    
Narasimha Raju Interview

హీరోగా అనేక సినిమాలలో నటించిన నరసింహారాజు, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఇండస్ట్రీకి రావడానికి ముందునుంచి నేను రిచ్ అనుకుంటూ ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లం కాదుగానీ .. ఫరవాలేదు. ఎలాంటి లోటు లేకుండా జీవితం గడిచిపోయేంత ఉండేది. 

మా తాత సంపాదించిన ఆస్తిని మా నాన్న కొంత పోగొట్టారు .. నేను బ్రహ్మాండంగా పోగొట్టాను. రేపు అనేది లేకుండా ఖర్చు చేయడం వలన అలాంటి పరిస్థితి వచ్చింది. ఖాళీగా ఉన్నప్పుడు పేకాట ఆడటం వలన .. ఎవరు ఎంత అడిగితే అంత ఇవ్వడం .. రేపటి రోజున సంపాదించుకోవచ్చులే అని ఖర్చు పెట్టడం వలన ఆస్తులు పోయాయి. మా పిల్లలు మాత్రం బాగానే సంపాదించారు. 

మా అబ్బాయి కెనడాలో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు మంచి చేస్తుందని అంటారు. అందువలన మంచి సంపాదన పరులయ్యారు. మా అబ్బాయి నాకు ఇక్కడ ఇల్లు కొనిపెట్టి తాను అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. అలాగే నాకు ముందుగా కారు కొనిపెట్టి ఆ తరువాతనే తాను కారు తీసుకున్నాడు. ఇంతకంటే ఏం కావాలి?" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News