Tamilnadu: దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జీ...వివరాలు ఇవిగో

  • తమిళనాడులో నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి
  • రామేశ్వరం సమీపంలో న్యూ పంబన్ బ్రిడ్జి పేరిట నిర్మాణం
  • 63 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ
  • ఓడలు, పడవలు వచ్చే సమయంలో ఈ బ్రిడ్జి పైకి లేసేలా నిర్మాణం
iidian ralways constructing first vertical lift ralway sea bridge at rameswaram in tamilnadu

దేశంలో నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో అత్యంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మించిన భారత ప్రభుత్వం... తాజాగా సముద్రంపై అవసరమైనప్పుడు పైకి లేచే విధంగా ఓ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తోంది. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా పిలుస్తోంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరుగుతున్న ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి వివరాలను వెల్లడిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రకటనతో పాటు నిర్మాణంలో ఉన్న సదరు బ్రిడ్జి ఫొటోలను కూడా విడుదల చేసింది.

దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం జరుపుకుంటోంది. తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మితమవుతున్న ఈ బ్రిడ్జికి న్యూ పంబన్ బ్రిడ్జిగా రైల్వే శాఖ నామకరణం చేసింది. దాదాపుగా 63 మీటర్ల పొడవుతో సముద్రంపై నిర్మిస్తోంది,. ఈ బ్రిడ్జి మార్గంలో నీటిపై పడవలు, ఓడలు వెళ్లే సమయంలో ఎలాంటి అవాంతరం లేకుండా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఆ తర్వాత యధాతథంగా తిరిగి సాధారణ రూపంలోకి వచ్చి చేరుతుంది.

More Telugu News