Santhosh Sobhan: ప్రభాస్ చేతుల మీదుగా 'లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్' ట్రైలర్ రిలీజ్!

Like Share and Subscribe movie trailer released
  • మేర్లపాక గాంధీ నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • సంతోష్ శోభన్ సరసన నాయికగా ఫరియా అబ్దుల్లా
  • కామెడీ ప్రధానంగా సాగే యాక్షన్ డ్రామా 
  • నవంబర్ 4వ తేదీన విడుదల
'ఏక్ మినీ కథ' సినిమాతో సంతోష్ శోభన్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత అతను చేసిన 'మంచిరోజులొచ్చాయి' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. చాలా తక్కువ సమయంలో మారుతి తెరకెక్కించిన ఆ సినిమా, ఆడియన్స్ ను నిరాశ పరిచింది. ఆ తరువాత సినిమాగా సంతోష్ శోభన్ 'లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్'  చేశాడు. నిహారిక బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు.

మేర్లపాక గాంధీ నుంచి చివరిసారిగా వచ్చిన 'మాస్ట్రో' మాత్రమే ఫ్లాప్ అయింది. అంతకుముందు ఆయన నుంచి వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' .. ' కృష్ణార్జున యుద్ధం' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన  'లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్' సినిమా నుంచి ప్రభాస్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. 

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సమపాళ్లలో సర్దేసిన కథ ఇది అని అర్థమవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ఫరియా అబ్దుల్లా అలరించనుంది. 'జాతి రత్నాలు' తరువాత అమ్మడికి ఆ స్థాయి సినిమాలు పడలేదు. ఈ సినిమాతో ఆమెకి హిట్ పడుతుందేమో చూడాలి. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Santhosh Sobhan
Faria Abdullah
Brahmaji

More Telugu News