whatsapp: దేశ వ్యాప్తంగా ఆగిపోయిన వాట్సాప్.. గందరగోళంలో వినియోగదారులు

  • మెసేజ్ లు సెండ్, రిసీవ్ కాని వైనం
  • కనిపించని డెలివరీ స్టేటస్
  • అధికారికంగా స్పందించని వాట్సాప్ యాజమాన్యం
whatsapp unable to send and receive messages

దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంలో మెసేజ్ లను పంపడం, రిసీవ్ చేసుకోవడం ఆగిపోయింది. దాదాపు 40 నిమిషాల నుంచి ఈ సమస్య కొనసాగుతోంది. వాట్సాప్ మెసేజ్ డెలివరీ అయినట్టు స్టేటస్ (టిక్ మార్క్) కూడా కనిపించడం లేదు. మరోవైపు ఈ సమస్యలపై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

అయితే, దీనిపై వాట్సాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నట్టు సమాచారం. గంట, గంటన్నరలో టెక్నికల్ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ ఆగిపోవడంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు.

More Telugu News