Kiram Mazumdar Shaw: కిరణ్ మజుందార్ షా భర్త మృతి

Kiran Mazumdar Shaws husband passed away
  • కిరణ్ భర్త జాన్ షా కన్నుమూత
  • బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • 1998లో కిరణ్ - జాన్ ల వివాహం
ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బెంగళూరులోని విల్సన్ గార్డెన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1998లో వీరి వివాహం జరిగింది.   

యూకేలోని గ్లాస్గో యూనివర్శిటీలో జాన్ షా హిస్టరీ, పొలిటికల్ ఎకానమీలో ఎంఏ చేశారు. మధురా కోట్స్ లిమిటెడ్ కు ఛైర్మన్ గా, కోట్స్ వియెల్లా గ్రూప్ కు ఫైనాన్స్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. బయోకాన్ లిమిటెడ్ కు కూడా వైస్ ఛైర్మన్ గా పని చేశారు. వివాహం తర్వాత ఆయన బయోకాన్ లో చేరారు. 1999 నుంచి బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో సభ్యుడిగా ఉన్నారు. 2001లో కంపెనీ వైస్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. కంపెనీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా, విదేశీ ప్రమోటర్ గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Kiram Mazumdar Shaw
Husband
Dead

More Telugu News