మునుగోడులో పట్టుబడ్డ నగదు కోటిన్నర పైనే: ఈసీ
- ఓటర్లను ప్రలోభానికి గురిచెయ్యకుండా అడ్డుకుంటున్నాం
- నియోజకవర్గంలో 2.4 లక్షల ఓటర్లు
- ఓటరు లిస్టులో పేర్లు గల్లంతైన వారు ఆఫీసుకు వస్తున్నారు
- రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ వెల్లడి
మునుగోడులో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారని ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ చెప్పారు. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారు రోజూ తమ ఆఫీసుకు వస్తున్నారని ఆయన వివరించారు. వాళ్ల నుంచి వివరాలు సేకరించి, పరిశీలిస్తున్నామని వివరించారు. ఉప ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనలు అన్నింటినీ పాటిస్తున్నామని చెప్పారు. ఈవీఎం మెషీన్లతో ఇటీవల నిర్వహించిన మాక్ పోల్ సాఫీగా జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రోహిత్ సింగ్ వివరించారు.