Abhiram: 'అహింస' నుంచి మాస్ మసాలా సాంగ్!

  • తేజ నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • హీరోగా అభిరామ్ దగ్గుబాటి పరిచయం
  • ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు   
Ahimsa movie lyrical song released

'అహింస' సినిమాతో అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ నిర్మించిన ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఒక యువకుడు చేసే పోరాటమే ఈ కథ. గతంలో తేజ నుంచి వచ్చిన ప్రేమకథా చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన నుంచి వస్తున్న ప్రేమకథా చిత్రం ఇది. 

విలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో గీతిక కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది మాస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మసాలా సాంగ్. ' అమ్మేశానే .. అమ్మేశానే' అంటూ మంచి ఊపు మీద ఈ సాంగ్ నడుస్తోంది. 

ఈ తరహా పాటల్లో ఉండవలసిన చురుక్కు .. చమక్కులు తగ్గకుండా చంద్రబోస్ చూసుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను మంగ్లీతో కలిసి ఆర్పీ పట్నాయక్ .. తేజ .. చంద్రబోస్ పాడటం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ - సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ మార్కుతో వస్తున్న ఈ సినిమాపై, యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

More Telugu News