Prabhas: ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu conveys birthday wishes to Prabhas
  • నేడు ప్రభాస్ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోలాహలం
  • ప్రభాస్ పై విషెస్ వెల్లువ
  • మరిన్ని ఘనతలు అందుకోవాలన్న చంద్రబాబు
  • తెలుగువారు గర్వించేలా చేయాలని ఆకాంక్ష
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ప్రభాస్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభాస్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తన ఘనతలతో తెలుగు వారు గర్వించేలా చేయాలని పేర్కొన్నారు. 

అటు, విక్టరీ వెంకటేశ్, రామ్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి నటులు, అనిల్ రావిపూడి, మారుతి వంటి దర్శకులు కూడా ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Prabhas
Birthday
Chandrababu
Tollywood

More Telugu News