T20 World Cup: వరల్డ్​ కప్​ లో భారీ విజయం సొంతం చేసుకున్న శ్రీలంక

Spinners and Kusal Mendis star in Sri Lanka comfortable win
  • సూపర్12 తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలుపు
  • సత్తా చాటిన కుశాల్ మెండిస్, బౌలర్లు
  • 9 వికెట్ల తేడాతో చిత్తయిన ఐర్లాండ్
ఓటమితో టీ20 ప్రపంచ కప్ ను ప్రారంభించినా తర్వాత పుంజుకొని సూపర్ 12 చేరుకున్న మాజీ చాంపియన్ శ్రీలంక టోర్నీలో భారీ విజయం సొంతం చేసుకుంది. సూపర్ 12 రౌండ్ గ్రూప్1లో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్ లో లంక 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుగా ఓడించింది. హోబర్ట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 128/8 స్కోరు చేసింది. హ్యారీ టెక్టర్ (42) టాప్ స్కోరర్ గా నిలవగా.. పాల్ స్టిర్లింగ్ (35) ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (1), లోర్కాన్ టకర్ (10), కర్టిస్ క్యాంఫర్ (2), జార్జ్ డాక్ రెల్ (14) నిరాశ పరిచారు. 

లంక బౌలర్లలో హసరంగ, మహేశ్ తీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రీలంక 15 ఓవర్లలో 133/1 చేసి సులభంగా గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్(68 నాటౌట్) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. ధనంజయ డిసిల్వ (31), చరిత్ అసలంక (31 నాటౌట్) కూడా రాణించారు. కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
T20 World Cup
Sri Lanka
win
ireland

More Telugu News