Sushmita Sen: మరోసారి బోయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన సుస్మితా సేన్

Sushmita Sen Rohman Shawl Renee and Alisah step out together to attend a wedding reception
  • ముంబైలోని ఓ డాక్టర్ కుమార్తె వివాహానికి హాజరు
  • వెంట ఇద్దరు దత్తత కుమార్తెలు రెనీ, అలీషా
  • డాక్టర్ దంపతులతో గ్రూపు ఫొటోలు
ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ బోయ్ ఫ్రెండ్ రోమాన్ షాల్ తో కలిసే ఉందా..? విడిపోయినట్టు వార్తలు వచ్చినా కానీ, వీరు తరచూ కలిసి కెమెరాలకు దర్శనమిస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీతో బీచ్ ఒడ్డున సుస్మితాసేన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు దర్శనమివ్వడం తెలిసిందే. తమది ప్రత్యేక బంధమని, పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటూ లలిత్ మోడీ ట్వీట్ కూడా చేసి తర్వాత తొలగించారు. 

కుటుంబాలు కలసి చేసుకునే వేడుకల్లో, పలు ఫంక్షన్లలో సుస్మితాసేన్, రోమాన్ కనిపిస్తూనే ఉన్నారు. ఈ వారాంతంలోనూ వీరు మరోసారి డాక్టర్ హృషికేష్ పాయ్, రిష్మా పాయ్ కుమార్తె అన్విష వివాహ రిసెప్షన్ కు కలసి హాజరయ్యారు. వీరి వెంట సుస్మిత దత్తత కుమార్తెలు రెనీ, అలీషా కూడా ఉన్నారు. రిసెప్షన్ కు హాజరై కలసి ఫొటోలు తీసుకున్నారు.
Sushmita Sen
Rohman Shawl
together
attend
wedding

More Telugu News