Telangana: బిలియన్ జనాభాకు ప్రతినిధి పీవీ.. సిడ్నీలో వెలసిన మాజీ ప్రధాని విగ్రహం

  • సిడ్నీలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఎన్నారై విభాగం
  • మహాత్మా గాంధీ తర్వాత విదేశాల్లో వెలసిన భారత నేత విగ్రహం పీవీదే
  • కార్యక్రమానికి హాజరైన మహేశ్ బిగాల, సురభి వాణి దేవి
trs nri wing unviels pa narasimha rao starue in sydney

భారత మాజీ ప్రధాన మంత్రి, తెలంగాణ రాజకీయ కురు వృద్ధుడు దివంగత పీవీ నరసింహారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరం సిడ్నీలో పీవీ విగ్రహాన్ని ప్రవాస భారతీయులు శనివారం ఆవిష్కరించారు. ఈ పరిణామంతో విదేశాల్లో విగ్రహం కలిగిన తొలి భారత ప్రధానిగా పివీకి అరుదైన గుర్తింపు దక్కింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ తర్వాత విదేశాల్లో వెలసిన తొలి భారత నేత విగ్రహం కూడా పీవీదే కావడం గమనార్హం.

బిలియన్ జనాభాకు ప్రతినిధి పీవీ పేరిట సిడ్నీలో ఈ విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఏర్పాటు చేసింది. శనివారం వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభి వాణి దేవి పాల్గొన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియాలోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

More Telugu News