Telangana: మునుగోడులో కారు ఆపి టీఆర్ఎస్ కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన బండి సంజయ్

tsr cadre shakes hands with bjp telangana chief bandi sanjay in munugode
  • మునుగోడు ఎన్నికల్లో జోరుగా సాగుతున్న ప్రచారం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తల ఆసక్తి
  • కారు ఆపి టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడిన సంజయ్
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి క్రమంలో ఓ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు కనిపించగానే...ఇంకో పార్టీకి చెందిన కార్యకర్తలు ఆయన వద్దకు పరగులు పెట్టడం, వారిని చూసి తన కారు ఆపి మరీ ఆ నేత వారితో కరచాలనం చేశారు. ఈ ఆసక్తికర దృశ్యం శుక్రవారం రాత్రి మునుగోడులో కనిపించింది.

మునుగోడు పోలింగ్ కు సమయం దగ్గరపడుతన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలంతా మునుగోడులోనే తిష్ఠ వేశారు. ఈ క్రమంలో శుక్రవారం మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళుతున్న బండి సంజయ్ కనిపించగానే... టీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు ఆయన కారు వద్దకు వెళ్లే యత్నం చేశారు. ఇది గమనించిన సంజయ్ తన కారును ఆపి...వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలైనప్పటికీ వారితో ఆత్మీయంగా కరచాలనం చేశారు.
Telangana
BJP
TRS
Munugode
Bandi Sanjay

More Telugu News