Team India: రేపు పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం కఠోర సాధన చేస్తున్న టీమిండియా

Team India hits hard at nets for tomorrow match against arch rival Pakistan
  • ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్
  • నేటి నుంచి సూపర్-12 దశ
  • దాయాదుల సమరంపై భారీ హైప్
  • మెల్బోర్న్ చేరుకున్న టీమిండియా
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్-12 మ్యాచ్ లు షురూ అయ్యాయి. సూపర్-12 దశలో భాగంగా రేపు (అక్టోబరు 23) మెల్బోర్న్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఎంసీజీ వేదికగా నిలవనుంది. 

ఈ మ్యాచ్ కోసం మెల్బోర్న్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడ్చుతున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 

రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్ పాండ్యా వంటి ప్రధాన ఆటగాళ్లందరూ మైదానంలో దిగి కసరత్తులు చేయడమే కాకుండా, ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. కాగా, టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీసును తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
Team India
Pakistan
Super-12
T20 World Cup

More Telugu News