జగన్ వెన్నులో వణుకు పుడుతోంది: బొండా ఉమ
- రైతుల పాదయాత్రను చూసి జగన్ భయపడుతున్నారన్న బొండా ఉమ
- పాదయాత్రకు పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శ
- మహిళా రైతులను పోలీసులు బూటు కాళ్లతో తన్నడం ఏమిటని ఆగ్రహం
ప్రభుత్వ ఆదేశాలతో రైతులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని బొండా ఉమ విమర్శించారు. తాడేపల్లి ఆదేశాలను పాటిస్తున్న ప్రతి పోలీసు అధికారిని టీడీపీ వదిలిపెట్టదని... ప్రైవేటు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడమే కాకుండా, సర్వీస్ రిమార్కులను వేయిస్తామని చెప్పారు. మహిళా రైతులను పోలీసులు బూటు కాళ్లతో తన్నడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మనుషులా? లేక మృగాలా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అని అడిగారు. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించరా? అని అన్నారు.