Harish Rao: చిన్న వయసులోనే రోగాలు రావడానికి కారణం ఇదే: హరీశ్ రావు

Changed life style causting breast cancer at small age says Harish Rao
  • చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోందన్న హరీశ్ రావు
  • మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణమన్న మంత్రి
  • మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని వ్యాఖ్య
మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగానే చిన్న వయసులోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోందని... ఒకప్పుడు పెద్ద వయసులో మాత్రమే కనిపించిన ఈ క్యాన్సర్... ఇప్పుడు 30 - 40 ఏళ్ల వయసు వారిలో కూడా కనిపిస్తోందని చెప్పారు. 

ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ నెల సందర్భంగా నిర్వహించిన అవగాహన నడక, మారథాన్ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Harish Rao
TRS
Breast Cancer

More Telugu News