Maharashtra: మహారాష్ట్రలో వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ.. రూ. 2.25 కోట్ల నగదు, 2.4 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Four held for looting Over Rs 2 cr cash and 2 kg gold from Latur businessmans home
  • లాతూరులో ఘటన
  • మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు
  • పోలీసులకు చిక్కిన ముఠా

మహారాష్ట్రలోని లాతూరులో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ. 2.25 కోట్ల నగదు, 2.4 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ నెల 12న స్థానిక కన్నయ్య నగర్‌లోని కాట్పూరు రోడ్డులో ఈ ఘటన జరిగింది. 

రాజ్‌కుమార్ అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లోకి తుపాకి, ఇతర మారణాయుధాలతో ప్రవేశించిన నలుగురు దుండగులు నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ భారీ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి కోసం పూణె, జల్నా, లాతూర్‌లలో గాలించి అదుపులోకి తీసుకున్నట్టు అదనపు ఎస్పీ అనురాగ్ జైన్ తెలిపారు. వారి నుంచి రూ. 50 లక్షల నగదు, రూ. 29 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News