ఏపీ సీఎంఓలోకి భరత్ గుప్తా... హౌసింగ్ ఎండీగా లక్ష్మీ షా

  • ఇద్దరు ఐఏఎస్ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • మరో ఇద్దరికి అదనపు బాధ్యతల అప్పగింత
  • సృజనకు ఏపీఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు
ap government transfers 2 ias officers

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లోకి మరో యువ ఐఏఎస్ అధికారికి ప్రవేశాన్ని కల్పించింది. సీఎంఓ జాయింట్ సెక్రటరీగా భరత్ గుప్తాను నియమించింది. అదే సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా లక్ష్మీ షాను నియమించింది.

మరోవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తున్న ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులో పూర్తి స్థాయి అధికారిని కాకుండా... వేరే శాఖలో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి సృజనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక కార్మిక శాఖ కమిషనర్ గా ఎంఎం నాయక్ కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. 

More Telugu News