Telangana: టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న వార్తలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి

bjp leader ap jitender reddy fores over the news of he is joining intotrs
  • జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ వార్తలు
  • వార్తలపై  మునుగోడు ఎన్నికల ప్రచారంలో స్పందించిన బీజేపీ నేత
  • బీజేపీలోనే ఉంటానని, బండి సంజయ్ ను సీఎం చేస్తానని వెల్లడి

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిపోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిపోతున్నారంటూ శుక్రవారం పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్లు తన చెవినపడిన వెంటనే జితేందర్ రెడ్డి... తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించారు. 

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు. ''నువ్వా నన్ను కొనేది? నాకా మెసేజ్ పంపించేది? నా వెంట్రుక కూడా కొనలేవు. బీజేపీని వదిలి తుక్కు నా కొడుకులు బయటకు పోతారు. బీజేపీలోనే ఉంటా. బండి సంజయ్ ను సీఎం చేస్తా'' అని జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News