Vizag: విశాఖ కోసం రాజీనామా చేస్తానన్న ధర్మాన.... వద్దని వారించిన సీఎం జగన్

ap minister dharmana prasada rao proposes resignation for vizag as capital
  • ఇప్పటికే విశాఖ రాజధాని కోసం వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా
  • తాజాగా నేరుగా జగన్ వద్దే రాజీనామా ప్రస్తావించిన ధర్మాన
  • గతంలోనూ విశాఖ కోసం రాజీనామా చేస్తానన్న రెవెన్యూ మంత్రి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శుక్రవారం భేటీ అయిన సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామా చేస్తానని ఆయన సీఎంకు చెప్పారు. తాను రాజీనామా చేసేందుకు అనుమతించాలని ఆయన జగన్ ను కోరారు. అయితే విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని జగన్ ఆయనను వారించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగన్ ఆయనకు చెప్పారు. 

 విశాఖ రాజధాని కోసం ఇప్పటికే విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని వాదిస్తున్న ధర్మాన కూడా ఇదివరకే విశాఖ రాజధాని కోసం తాను రాజీనామా చేస్తానని పలుమార్లు ప్రకటించారు. తాజాగా సీఎం జగన్ తో భేటీ సందర్భంగానూ ఆయన ఈ ప్రతిపాదన చేయగా... జగన్ ఆయనను వారించారు.
Vizag
YSRCP
YS Jagan
Dharmana Prasada Rao
Karanam Dharmasri

More Telugu News