Jagan: సీఎం జగన్ ను కలిసిన నేవీ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా

Vice Admiral Biswajit Das Gupta met CM Jagan
  • తాడేపల్లి విచ్చేసిన తూర్పు తీర కమాండింగ్ ఇన్ చీఫ్
  • సీఎం జగన్ తో మర్యాదపూర్వక సమావేశం
  • డిసెంబరు 4న నేవీ డే
  • విశాఖ రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా ఇవాళ తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ ను కలిశారు. డిసెంబరు 4న ఇండియన్ నేవీ డే సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించే వేడుకలకు రావాలంటూ సీఎం జగన్ ను ఆహ్వానించారు. తూర్పు తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు నేవీ చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు. 

ఈ భేటీ సందర్భంగా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తాను సీఎం జగన్ సన్మానించి, వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. అటు, సీఎం జగన్ కు బిశ్వజిత్ దాస్ గుప్తా నేవీ తరఫున ఐఎన్ఎస్ విక్రాంత్ నమూనాను బహూకరించారు.

  • Loading...

More Telugu News