Kantara: 'కాంతార'లో ఆ శబ్దం మాకు సెంటిమెంట్... దాన్ని ఎవరూ అనుకరించవద్దు: రిషబ్ శెట్టి

  • సంచలన విజయం సాధించిన కాంతార
  • కన్నడ సీమను దాటి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న చిత్రం
  • మార్మోగుతున్న దర్శక హీరో రిషబ్ శెట్టి పేరు
  • ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంటున్న 'ఓ' అనే అరుపు
Rishab Shetty appeals audience do not imitate the sound as seen in Kantara

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు కాంతార. ఈ కన్నడ చిత్రం భాషా సరిహద్దులు దాటుకుని పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో అనుసరించే ప్రాచీన భూత కోల అనే ప్రాచీన ఆచారాన్ని ఇందులో చూపించారు. 

దైవ నర్తకులు ఈ భూత కోలను ప్రదర్శిస్తూ 'ఓ' అని అరుస్తారు. కాంతార చిత్రంలో ఈ అరుపులను స్పెషల్ ఎఫెక్ట్స్ తో రికార్డు చేశారు. వీటిని థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు బయటికి వచ్చిన తర్వాత కూడా 'ఓ' అని అరుస్తూ తమ క్రేజ్ ను వెల్లడిస్తున్నారు. 

దీనిపై కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించారు. కాంతార చిత్రంలో 'ఓ' అనే అరుపు ఒక ఆచార, సంప్రదాయానికి సంబంధించినదని, దాన్ని ఎవరూ బయట అరవొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రాచీన సంస్కృతికి చెందిన సున్నితమైన అంశం కావడంతో ఆచారం దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. 'ఓ' అనే అరుపును తాము శబ్దంగానే కాకుండా, ఓ సెంటిమెంట్ గా భావిస్తామని స్పష్టం చేశారు. 

More Telugu News