YSRCP: ఆ మాట అబద్ధమని చంద్రబాబు నిరూపిస్తే... నేను మంత్రి పదవికి అనర్హుడినే: బొత్స సత్యనారాయణ

ap minister botsa satyanarayana comments on amaravati farmers yatra
  • మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన బొత్స
  • రైతుల ముసుగులో టీడీపీ నేతలు యాత్ర చేస్తున్నారని విమర్శ
  • భవిష్యత్తును చంద్రబాబు చీకట్లోకి నెడుతున్నారని ఆరోపణ
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్రపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా బొత్స పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతుల పాదయాత్ర విశాఖకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని బొత్స పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర ఏ ప్రాంతంలో కొనసాగుతుంటే ఆ ప్రాంతాల్లో బంద్ పాటించాలని కూడా ఆయన కోరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తావన తీసుకొచ్చిన బొత్స... భవిష్యత్తును చంద్రబాబు చీకట్లోకి నెట్టే యత్నం చేస్తున్నారన్నారు. ఈ మాట అబద్ధమని చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ నిరూపిస్తే తాను మంత్రి పదవికి అనర్హుడిగా ఒప్పుకుంటానన్నారు.
YSRCP
Botsa Satyanarayana
Gudivada Amarnath
Amaravati
TDP
Chandrababu

More Telugu News