26న విడుదల కానున్న 'నథింగ్' ఇయర్ బడ్స్

  • ఫ్లిప్ కార్ట్, మింత్రా పోర్టల్స్ పై విక్రయాలు
  • పారదర్శక డిజైన్ తో రానున్న ఇయర్ బడ్స్
  • లిప్ స్టిక్ మాదిరిగా పొడవుగా ఉండే కేస్
Nothing Ear stick will be available on Myntra after October 26 launch

నథింగ్ ఫోన్ (1) మాదిరే నథింగ్ ఇయర్ బడ్స్ (ఇయర్ స్టిక్) మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నథింగ్ ఫోన్ వెనుక భాగం లోపలి విడిభాగాలన్నీ కనిపిస్తూ పారదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మాదిరిగా ఇయర్ బడ్స్ కనిపించనున్నాయి. 

నథింగ్ ఇయర్ బడ్స్ విడుదల ఈ నెల 26న జరగనుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు, మింత్రా పోర్టల్స్ లో వీటి విక్రయాలు జరుగుతాయని నథింగ్ తాజాగా ప్రకటించింది. లిప్ స్టిక్ మాదిరి కేస్ వీటితో రానుంది. మరింత మంది కస్టమర్లను ఈ ఉత్పత్తితో చేరుకుంటానని, ముఖ్యంగా ఫ్యాషన్ కు ప్రాధాన్యం ఇచ్చే వారికి చేరువ అవుతామని కంపెనీ భావిస్తోంది. 

నథింగ్ గతేడాది తొలి ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. వీటితో పోలిస్తే ఇప్పుడు వచ్చే నథింగ్ ఇయర్ (స్టిక్) కొంత భిన్నంగా ఉండనున్నాయి. చిన్న కేస్ తో కాంపాక్ట్ గా ఉంటుంది. ఒక్కో ఇయర్ బడ్ కేవలం 4.4 గ్రాముల బరువుతో ఉంటుందని కంపెనీ తెలిపింది. టచ్ కంట్రోల్స్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. నథింగ్ ఇయర్ స్టిక్ ధర గత వెర్షన్ తో పోలిస్తే కొంత అందుబాటులోనే ఉండొచ్చని అంచనా.

More Telugu News