Sherlyn Chopra: నిర్మాత సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా

Filmmaker Sajid Khan made me touch his genitals Sherlyn Chopras explosive claims
  • ముంబై పోలీసులకు ఇటీవలే ఫిర్యాదు 
  • 2005లో లైంగిక వేధింపులకు గురైనట్టు ఆరోపణ
  • ధైర్యం లేకే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానన్న నటి
  • ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడి
నటి షెర్లిన్ చోప్రా.. ప్రముఖ నిర్మాత సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. సాజిద్ తనపై లైంగిక వేధింపులు, దోపిడీ, బెదిరింపులకు పాల్పడినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2005 నాటి వేధింపులపై ఆమె ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడం గమనించాలి.

‘‘సాజిద్ వంటి పెద్ద వ్యక్తిపై ఫిర్యాదు దాఖలు చేసేంత ధైర్యం లోగడ నాకు లేదు. 2008లో మీటూ ఉద్యమంతో మహిళలు ముందుకు వస్తున్నారు. అతడ్ని జైలులో పెట్టాలి’’ అని షెర్లిన్ చోప్రా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఇటీవలే ముంబై పోలీసులకు సాజిద్ ఖాన్ పై లైంగిక దోపిడీ, బెదిరింపులపై ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. 

‘‘పోలీసులు ఈ ఘటన ఎప్పుడు జరిగిందని ముందు నన్ను అడిగారు. ఇది 2005లో జరిగినట్టు చెప్పాను. దీనిపై మమ్మల్ని ఆశ్రయించడానికి ఇంత కాలం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. పెద్ద వ్యక్తి అయిన సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టేంత ధైర్యం అప్పట్లో నాకు లేదని చెప్పాను’’ అని వివరించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో మహిళలు ముందుకు వచ్చి తమకు జరిగిన భయంకర అనుభవాలను వెల్లడిస్తుండడంతో తనలోనూ ధైర్యం వచ్చినట్టు ఆమె తెలిపింది. 

‘‘మీటూ నిందితుడైన సాజిద్ ఖాన్ బాధిత మహిళలతో ఎలా ప్రవర్తించాడన్నది మీడియా ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాను చూస్తే తెలుస్తుంది. కొందరిని శృంగారం గురించి అతడు అడిగాడు. రోజుకు ఎన్ని సార్లు కావాలి, ఎంత మంది బోయ్ ఫ్రెండ్స్ అంటూ ప్రశ్నించాడు. అతడు తన ప్రైవేటు పార్ట్ లను చూపించి, నన్ను పట్టుకోమన్నాడు’’ అని షెర్లిన్ చోప్రా బయటపెట్టింది.
Sherlyn Chopra
explosive claims
Filmmaker
Sajid Khan
police complaint

More Telugu News