బుట్టబొమ్మ అంకితభావం.. కాలుకు గాయమైనా షూటింగ్ ఆపని పూజా హెగ్డే
- తన చీలమండలో చీలక వచ్చిందని చెప్పిన పూజ
- కాలుకు బ్యాండేజీ వేసిన ఫొటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్
- ఒక రోజు తిరగకుండానే షూటింగుకు హాజరు
తన కాలుకు దెబ్బ తగిలిందని పూజ నిన్న తెలిపింది. చీలమండలో చీలిక ఏర్పడిందని చెబుతూ బ్యాండేజీ వేసిన కాలు ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దాంతో, తను కొన్ని రోజులు షూటింగ్ కు దూరం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఒక రోజు కూడా తిరగకుండానే తను షూటింగ్ లొకేషన్ లో ప్రత్యక్షమైంది. కాలుకు బ్యాండేజీతోని మేకప్ రూమ్ లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పూజా ‘షో నడవాల్సిందే' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ముంబైలో సల్మాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీగా జాన్’ చిత్రం షూటింగ్ లో పూజ పాల్గొంటోంది. కాలుకు దెబ్బ తగిలినా కూడా పని ఆపకుండా ముందుకెళుతుండడంతో పూజ అంకితభావంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.