Vaishali Takkar: టీవీ నటి వైశాలీ ఠక్కర్ ఆత్మహత్య కేసు.. ప్రధాన నిందితుడికి అరదండాలు

Vaishali Takkar Suicide Case Rahul Navlani Arrested
  • ‘ససురాల్ సిమర్ కా’, ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ వంటి సీరియళ్లతో వైశాలికి పేరు
  • ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న నటి
  • పొరుగింటి రాహుల్‌ తనను వేధిస్తున్నాడంటూ సూసైడ్ నోట్
29 ఏళ్ల టీవీ నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన రాహుల్ నవలానీకి పోలీసులు అరదండాలు వేశారు. ‘ససురాల్ సిమర్ కా’, ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ వంటి సీరియళ్లతో పేరు సంపాదించుకున్న వైశాలి ఆదివారం ఇండోర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

 తన కుమార్తె మృతికి పొరుగింటి యువకుడు రాహుల్ నవలానీయే కారణమని వైశాలి తల్లి అనుకౌర్ ఠక్కర్ ఆరోపించారు. వైశాలి పెళ్లికి అడ్డంకులు సృష్టించాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఇండోర్ పోలీసులు తాజాగా రాహుల్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. 

వైశాలి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు రాహుల్ నవలానీతోపాటు దిశ దంపతులే కారణమని వైశాలి పేర్కొన్నారు. వారు తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌ తాజాగా పోలీసులకు చిక్కగా, దిశ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వైశాలీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసినప్పటి నుంచి రాహుల్ ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు అను ఠక్కర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నిందితుడు రాహుల్‌ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను ఇండోర్ కోర్టు తిరస్కరించింది.
Vaishali Takkar
Madhya Pradesh
Indore
Rahul Navlani

More Telugu News