సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్ బ్రదర్స్!

  • బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'ఖైదీ'
  • సంచలన విజయాన్ని సాధించిన 'విక్రమ్'
  • రెండు సినిమాల దర్శకుడు లోకేశ్ కనగ రాజ్
  • ఆయన పిలుపు కోసమే సూర్య - కార్తి ఎదురుచూపులు   
Surya and Karthi Sequels

తమిళనాట స్టార్ బ్రదర్స్ గా సూర్య - కార్తి దూసుకుపోతున్నారు. ఎవరికివారు తమ ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తి చేసిన 'ఖైదీ' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కార్తి కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సీక్వెల్ కోసం కార్తి అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 


ఇక సూర్య విషయానికి వస్తే ఆయన ప్రతినాయకుడిగా నటించిన 'విక్రమ్' సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య ఆకట్టుకున్నాడు. ఫస్టు పార్టు చివర్లో వచ్చిన సూర్య రోల్, సెకండ్ పార్టు మొత్తం కనిపించనుంది. అందువలన సూర్య అభిమానులంతా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ అన్నదమ్ములిద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి దక్కింది. ప్రస్తుతం ఆయన విజయ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 'ఖైదీ' సీక్వెల్ వచ్చే ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లొచ్చని కార్తి చెబుతున్నాడు. ఇక 'విక్రమ్' సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందనేది లోకేశ్ చెప్పాలని సూర్య తేల్చేశాడు. ఒకే డైరెక్టర్ కోసం స్టార్స్ బ్రదర్స్ .. వారి ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి.

More Telugu News