సిత్రంగ్ తుపాను.. తీవ్రత, దిశపై సస్పెన్స్
- దూసుకొస్తున్న సిత్రంగ్ తుపాను
- ఏ వైపు వెళ్తుందో తెలియడం లేదంటున్న వాతావరణ శాఖ
- తీర ప్రాంతాల అప్రమత్తం
ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉన్నప్పటికీ దాని తీవ్రత, మార్గంపై అంచనా వేయడం కష్టంగా ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మ్రుతుంజయ్ మహపాత్ర తెలిపారు. మరోపక్క, పలు కోస్తా జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. సూచనను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం తమ ఉద్యోగుల సెలవులను అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 25 వరకు రద్దు చేసింది. సిత్రంగ్ కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కరిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తుపాను మొదలైతే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.