ఓటీటీ సెంటర్స్ లో దీపావళి సందడి మొదలైనట్టే!

  • ఈ దీపావళికి థియేటర్లలో దిగుతున్న నాలుగు సినిమాలు
  • 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఒకే ఒక జీవితం' 
  • ఈ నెల 24వ తేదీన నుంచి 'ఆహా'లో 'స్వాతిముత్యం'
  • ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ  
Swathimuthyam will release in Aha

దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో, ఇటు థియేటర్స్ లోను .. అటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైన సినిమాల సందడి మొదలవుతోంది. తెలుగు సినిమాల విషయానికే వస్తే, ఈ దీపావళి కానుకగా 'జిన్నా' .. 'ఓరి దేవుడా' .. 'ప్రిన్స్' సినిమాలతో పాటు, తమిళ అనువాదంగా 'సర్దార్' కూడా థియేటర్లలో దిగిపోతోంది. ఈ నాలుగు సినిమాలలోనూ 'జిన్నా' పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్ కామెడీకి రొమాన్స్ ను యాడ్ చేసుకుని మరీ విష్ణు వస్తున్నాడు. 

ఇక ఓటీటీ వైపు చూస్తే .. శర్వానంద్ హీరోగా చేసిన 'ఒకే ఒక జీవితం' స్ట్రీమింగ్ ఈ రోజునే 'సోనీ లివ్'లో మొదలైంది. జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లను గతంలోకి వెళ్లి సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి, థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమల అక్కినేని ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. 

అలాగే దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్వాతి ముత్యం' కూడా దీపావళికి 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను 'ఆహా' నుంచి వదులుదామని అనుకున్నారు. కానీ మరో నాలుగు రోజులు ముందుకు జరిపి, ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ జరగనున్నట్టు ప్రకటించారు. బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా, సరైన పబ్లిసిటీ లేక వెనుకబడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ రావడం ఖాయమని చెప్పచ్చు..

More Telugu News