Amaravati: అమరావతి మహాపాదయాత్రలో పాల్గొన్న హీరో నందమూరి తారకరత్న

tollywood hero nandamuri tarakaratna participated in amaravati farmers yatra
  • రాజమహేంద్రవరం పరిసరాల్లో సాగుతున్న యాత్ర
  • యాత్రకు మద్దతు పలికిన నందమూరి తారకరత్న
  • ఇటీవలే యాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట చేపట్టిన యాత్రకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రకు మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన స్వయంగా యాత్రలో పాలుపంచుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఇటీవలే టీడీపీ యువ నేతలు పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధాకృష్ణలు కూడా అమరావతి రైతుల యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాత్రను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన తెలుపుతుండగా...టీడీపీకి చెందిన నేతలు, సినీ నటులు యాత్రకు మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం.
Amaravati
Andhra Pradesh
Nandamuri Taraka Ratna
Tollywood
Rajamahendravaram

More Telugu News