T20 World Cup: వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లాండ్ పై ఐర్లాండ్ ఘన విజయం

Ireland in race for Super 12s spot after win over scotland
  • 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ గెలుపు
  • చెలరేగిన కర్టిస్ క్యాంఫర్
  • సూపర్12 రేసులోకి వచ్చిన ఐరిష్ టీమ్
టీ20 ప్రపంచ కప్ గ్రూప్–బి తొలి మ్యాచ్ లో రెండుసార్లు ప్రపంచ విజేత వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లాండ్ పై ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. గ్రూప్–బిలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. ఓపెనర్ మైఖేల్ జోన్స్ (55 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 86) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రికీ బెరింగ్టన్ (37), మాథ్యూ క్రాస్ (28) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 19 ఓవర్లలోనే 180/4 స్కోరు చేసి విజయం సాధించింది. కర్టిస్ కాంఫర్ (32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్) ఐర్లాండ్ కు విజయం కట్టబెట్టాడు. జార్జ్ డాక్ రెల్ (39 నాటౌట్) కూడా రాణించాడు. తొలి పోరులో జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ ఈ గెలుపుతో ఐర్లాండ్ సూపర్12 రేసులోకి వచ్చింది.
T20 World Cup
ireland
win
scotland
super12

More Telugu News