Allu Aravind: వీరిద్దరితో సినిమా తీయాలనేదే నా కోరిక: అల్లు అరవింద్

To make film with Allu Arjun and Ram Charan is my dream says Allu Aravind
  • అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమా తీయాలనేది తన కోరికన్న అల్లు అరవింద్
  • 'చరణ్-అర్జున్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించానని వెల్లడి
  • వచ్చే ఏడాది 'రామాయణం' సినిమా పట్టాలెక్కుతుందన్న అరవింద్
తన కుమారుడు అల్లు అర్జున్, మేనల్లుడు రామ్ చరణ్ లతో సినిమా తీయాలనేది తన కోరిక అని సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. వీరితో చేయాలనుకుంటున్న సినిమాకు 'చరణ్-అర్జున్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి, ప్రతి ఏడాది రెన్యువల్ చేయిస్తున్నానని చెప్పారు. తన కోరిక తప్పకుండా తీరుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. 

తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న 'రామాయణం' ప్రాజెక్ట్ ను పక్కన పెట్టలేదని అల్లు అరవింద్ తెలిపారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఏడాదిన్నరగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా ఇది నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమాను నిర్మించడం చాలా పెద్ద ప్రయత్నమని అన్నారు.
Allu Aravind
Ramcharan
Allu Arjun
Tollywood

More Telugu News