తన హీరోయిన్స్ నటనకి రేటింగ్ ఇచ్చిన విష్వక్సేన్!

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'ఓరి దేవుడా'
  • కథానాయికలుగా మిథిల - ఆషా పరిచయం 
  • సంగీత దర్శకుడిగా లియోన్ జేమ్స్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా రిలీజ్
Ori Devuda Team Interview

విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమా రూపొందింది. అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో మిథిల తివారి - ఆషా భట్ కథానాయికలుగా పరిచయమవుతున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ నటించారు. లియోన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ను సుమ ఇంటర్వ్యూ చేసింది. సుమ అడిగిన ప్రశ్నలకు విష్వక్సేన్ స్పందిస్తూ .. "ఇది ఒక కొత్త పాయింటుతో రూపొందిన సినిమా. ఈ సినిమా చూసిన తరువాత ఇలాంటి ఒక అవకాశం తమకి కూడా వస్తే బాగుండునే అని ప్రతి ఒక్కరూ అనుకోవడం ఖాయం. అలా అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. 

సినిమాలో లవ్ .. ఎంటర్టయిన్ మెంట్ పుష్కలంగా ఉంటాయి. భార్యాభర్తల కీచులాట కంటే భారీ ఫైట్స్ ఏముంటాయి? ఇక వారిద్దరి మధ్య జరిగే రొమాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక కామెడీ అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇద్దరు హీరోయిన్లకు తెలుగులో ఇదే తొలి సినిమా. నటన పరంగా 10కి ఆషాకి 9.2 ఇవ్వొచ్చు .. మిథిలకి 9.3 ఇవ్వొచ్చు" అంటూ చెప్పుకొచ్చాడు..

More Telugu News