Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

Case against Pawan Kalyan in National Human Rights Commission
  • మానవ హక్కుల కమిషన్ కు జాతీయ బీసీ సంఘం ఫిర్యాదు
  • విశాఖ గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు యత్నించారన్న బీసీ సంఘం
  • రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు యత్నించారని ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు జాతీయ బీసీ సంఘం తెలిపింది. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారని... దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. 

విశాఖ ఘటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు యత్నించారని... పవన్ కల్యాణ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని తమ ఫిర్యాదులో కమిషన్ ను కోరామని చెప్పారు. తమ ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించిందని తెలిపారు.  

  • Loading...

More Telugu News