ఎన్నికల సభ కోసం వంటమనిషిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం
- ఎల్లంబావిలో ఎన్నికల సభను నిర్వహించిన టీఆర్ఎస్
- సభకు వచ్చే వారి కోసం భోజనం తయారీలో మల్కాజిగిరీ ఎమ్మెల్యే
ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ కు చెందిన మల్కాజిగిరీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏకంగా వంట మనిషిగా మారిపోయారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో మంగళవారం టీఆర్ఎస్ ఎన్నికల సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే వారి కోసం ఆ పార్టీ భోజన ఏర్పాట్లు కూడా చేసింది. ఈ భోజనం తయారీలో స్వయంగా పాలుపంచుకున్న హన్మంతరావు గరిట పట్టి వంట పనుల్లో నిమగ్నమయ్యారు.