Chandrababu: విజయవాడలో పవన్ కల్యాణ్ ను కలిసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu met Pawan Kalyan in Vijayawada
  • ఇటీవల విశాఖలో పవన్ పర్యటన
  • నగరంలో ఉద్రిక్తతలు
  • పవన్ కు సంఘీభావం తెలిపిన చంద్రబాబు
  • జనసేనానితో సమావేశం 
గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. విశాఖలో వైసీపీ గర్జన, అదే రోజున పవన్ కల్యాణ్ ఎంట్రీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసుల ఆంక్షలతో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే పవన్ విశాఖ నుంచి వెనుదిరిగారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయవాడలో పవన్ కల్యాణ్ ను కలిశారు. నగరంలోని నోవోటెల్ హోటల్ కు వచ్చిన చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురు సమావేశమై విశాఖలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జనసేనానికి సంఘీభావం తెలిపారు. 

కాగా, ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబు కూడా పాల్గొన్నారు.
Chandrababu
Pawan Kalyan
Vijayawada
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News