మళ్లీ చెబుతున్నా... పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టారే: మంత్రి అంబటి రాంబాబు
- తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్
- పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అంబటి రాంబాబు
- పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని వ్యాఖ్య
- పవన్ రాజకీయాలకు పనికివచ్చే వ్యక్తి కాదని ఆరోపణ
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని చెప్పిన పవన్... చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకునే ఈ మాట మాట్లాడారని అంబటి అన్నారు. ఈ విషయం రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనానికి కూడా అర్థమైపోయిందని కూడా ఆయన అన్నారు. ఓ రాజకీయ పార్టీ నేతగా ఎవరైనా తాను పదవిలోకి రావాలని కోరుకుంటారు తప్పించి... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని చెప్పే నేతను పవన్ ను మాత్రమే చూస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ప్యాకేజీ స్టార్ కాకుండా సొంత స్టారా? అని కూడా అంబటి అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి వచ్చే వ్యక్తి కాదని ఆయన తేల్చి చెప్పారు.