Apple: యాపిల్స్​ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. ఇలా చేస్తే బెటర్​ అంటున్న నిపుణులు

  • తడి తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టాలని సూచిస్తున్న నిపుణులు
  • ఇతర పండ్లతో కలప కూడదని సూచన 
  • ఏమాత్రం పాడైనా వాటిని తీసి విడిగా పెట్టాలని సలహా 
  • ఈ జాగ్రత్తలతో యాపిల్స్ తాజాగా ఉండటంతోపాటు పోషకాలూ నష్టపోకుండా ఉంటాయని వెల్లడి
The best way to refrigerate apples

రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ కు దూరంగా వుండచ్చని ఓ పాత సామెత. అలాగని రోజుకు ఒక యాపిల్‌ కొనుక్కుని తెచ్చుకుని తినలేం. కొన్ని తెచ్చుకుని ఇంట్లో నిల్వ చేసుకుంటాం. అయితే యాపిల్స్‌ అయినా, మరే పండ్లు అయినా కొన్ని రోజుల్లోనే పాడైపోతాయి. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా త్వరగానే దెబ్బతింటుంటాయి. ఈ క్రమంలోనే యాపిల్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలనే దానిపై పోషకాహార నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యాపిల్స్ తాజాగా ఉండటమే కాకుండా.. వాటిలోని పోషకాలు కూడా నష్టపోకుండా ఉంటాయని వివరిస్తున్నారు.

యాపిల్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఇలా చేయాలి

  • యాపిల్స్ ను సరిగా నిల్వ చేసుకోగలిగితే.. కనీసం మూడు, నాలుగు వారాలు తాజాగా ఉంటాయని, అవసరమైతే మరో రెండు వారాలు కూడా నిల్వ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • యాపిల్స్ కొనేటప్పుడు వాటి కాడలు పోకుండా చూసుకోవాలని.. కాడలు ఉన్న యాపిల్స్ కొంత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని సూచిస్తున్నారు.
  • అన్నింటికన్నా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే.. యాపిల్స్ లో ఏదైనా దెబ్బతిన్నదా, చెడిపోయిందా అన్నది చూడాలి. ఒక్క పాడైపోయిన యాపిల్ ఉన్నా.. మిగతా యాపిల్స్ కూడా వేగంగా పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • మిగతా పండ్లు, కూరగాయలతో యాపిల్స్ ను కలిపి ఉంచకూడదు. విడిగా పెట్టాలి. ఎందుకంటే యాపిల్స్ నుంచి వెలువడే ఇథైలిన్ గ్యాస్ తో ఇతర పండ్లు, కూరగాయలు త్వరగా పక్వానికి వస్తాయి. అవి పాడైపోయి.. తద్వారా యాపిల్స్ కూడా పాడైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
  • వీలైతే చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ లో యాపిల్స్ ను ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టాలని సూచిస్తున్నారు.
  • ఇక ఫ్రిడ్జ్ లలో ప్రత్యేకంగా పండ్ల కోసం కేటాయించిన డ్రాలలో పండ్లను ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ టెంపరేచర్ ను మైనస్ ఒకటి నుంచి జీరో డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలని.. అంతకన్నా తక్కువైతే  ఎక్కువైనా యాపిల్స్ ఫ్రీజ్ అయి దెబ్బతింటాయని చెబుతున్నారు.

More Telugu News