Team India: వచ్చే ఏడాది ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు: జై షా

  • సుదీర్ఘకాలంగా పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని భారత్
  • పాక్ లో పర్యటించేందుకు భారత్ విముఖత
  • రాజకీయ అంశాలే కారణం
  • 2023 ఆసియా కప్ తటస్థ వేదికపై జరిగే అవకాశముందున్న షా
Jay Shah clarifies India wont be travel to Pakistan for Asia Cup

రాజకీయ కారణాలతో భారత జట్టు ఒకటిన్నర దశాబ్ద కాలంగా పాకిస్థాన్ లో పర్యటించడం మానుకుంది. అయితే, వచ్చే ఏడాది ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఆసియా స్థాయిలో ఇది ప్రధాన టోర్నీ అయినందున టీమిండియా తప్పక ఆడాల్సి ఉంటుందని, అందుకే ఈ టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 

భారత్ చివరిసారిగా 2008లో పాకిస్థాన్ లో పర్యటించింది. అప్పట్లో ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహించగా, ఆ టోర్నీలో భారత్ పాల్గొంది. ఈ టోర్నీలో శ్రీలంక విజేత కాగా, భారత్ రన్నరప్ గా నిలిచింది.

More Telugu News