Pawan Kalyan: చెప్పు తీసుకుని కొడతా: వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

  • ఇంకోసారి ప్యాకేజ్, ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని పవన్ హెచ్చరిక
  • ఎనిమిదేళ్ల కాలంలో సినిమాల ద్వారా రూ. 120 కోట్లు సంపాదించానని వెల్లడి
  • వైసీపీ గూండాలను గొంతు పిసికి తొక్కేస్తానని వార్నింగ్
Pawan Kalyan warning to YSRCP leaders

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. వెధవల్లారా, సన్నాసుల్లారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను స్కార్పియో కొన్నా కూడా వాళ్లిచ్చారా, వీళ్లిచ్చారా అని వైసీపీ నేతలు అంటుంటారని... ఒరేయ్ వెధవల్లారా నేనెంత సంపాదిస్తానో మీకు తెలుసురా? అని ప్రశ్నించారు.  

గత 8 సంవత్సరాల కాలంలో తాను ఆరు సినిమాలు చేశానని... రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల రూపాయలను సంపాదించానని రూ. 33,37,04,776ల ట్యాక్స్ కట్టానని పవన్ చెప్పారు. ఇది జీఎస్టీ కాకుండా అని తెలిపారు. తన బిడ్డల పేరిట వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి పార్టీ ఆఫీస్ పెట్టానని చెప్పారు. 2021-22 లో రూ. 5 కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చానని తెలిపారు. హుదూద్ తుపాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డు, పీఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కలిపి దాదాపు రూ. 12 కోట్లు ఇచ్చానని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇచ్చానని తెలిపారు. 

జనసేనకు ఐదు బ్యాంక్ ఖాతాలున్నాయని.. అందులో రూ. 17,58,06,323 కార్పస్ ఫండ్ ఉందని పవన్ చెప్పారు. కేవలం రైతు భరోసా కోసం రూ.3,50,78,226ల ఉందని చెప్పారు. మొన్న తన పుట్టిన రోజు కోసం జనసైనికులు చేయాలనుకున్న కార్యక్రమం కోసం వచ్చిన విరాళాలు రూ. 4,32,19,395లు అని వెల్లడించారు. 

ప్యాకేజ్, ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి నా కొడు*లు ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క వైసీపీ నా కొడు*ని చెప్పు తీసుకుని కొడతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పగిలిపోయేలా, దవడ వాచి పోయేలా అటు తిప్పి, ఇటు తిప్పి కొడతానని హెచ్చరించారు. తమాషాగా ఉందా కొడ**రా? అంటూ విరుచుకుపడ్డారు. ఇంకొకసారి ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానని వార్నింగ్ ఇచ్చారు. పళ్లు రాలగొడతా కొడ**రా అంటూ హెచ్చరించారు. తన కాలికి ఉన్న చెప్పును చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. 

'అరేయ్ ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా... నా సహనమే ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఏరా వైసీపీ గూండాగాళ్లలారా..  మీ దగ్గర క్రిమినల్స్, గూండాలు ఉన్నారా... ఒంటి చేత్తో మెడ పిసికి తొక్కేస్తా' అని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు నిప్పులు చెరిగారు.

More Telugu News