Manchu Vishnu: ఆ విషయంలో నాన్నగారి ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పాలి: మంచు విష్ణు

Manchu Vishnu Interview
  • జోరుగా జరుగుతున్న 'జిన్నా' ప్రమోషన్స్ 
  • అనూప్ సంగీతం హైలైట్ అవుతుందన్న విష్ణు 
  • ఇంతవరకూ డైరెక్టర్ల ఎంపికలో పొరపాటు జరిగిందంటూ వ్యాఖ్య 
  • ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని వెల్లడి  

మోహన్ బాబు కమెడియన్ గా .. విలన్ గా .. హీరోగా తన సత్తాను చాటుకున్నారు. హీరోగాను .. నిర్మాతగాను వరుస విజయాలను అందుకుంటూ వెళ్లారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు, ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేకపొతున్నాడు. ఈ విషయానికి సంబంధించిన ఒక ప్రశ్న, తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నుంచి ఆయనకి ఎదురైంది. అందుకు విష్ణు తనదైన శైలిలో స్పందించాడు. 

"నేను ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అవుతోంది. అయితే అనుకున్నంత స్టార్ డమ్ ఇంతవరకూ రాలేదనే చెబుతాను. ఈ విషయంలో ముందుగా నేను సారీ చెప్పవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నాన్నగారి అభిమానులే అని చెప్పాలి. మా హీరో మోహన్ బాబు కొడుకు వచ్చాడు అని వాళ్లంతా నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను వాళ్లు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాను" అని అన్నాడు. 

"నాన్నగారి అభిమానులు కొంత నిరాశకి గురికావడానికి కారణం నేను ఎంచుకున్న కథలు కావొచ్చు .. డైరెక్టర్లు కావొచ్చు. సరైన డైరెక్టర్లను ఎంచుకోకపోవడం నేను చేసిన పొరపాటు. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాను. 'జిన్నా' విషయానికి వస్తే, ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. నా కెరియర్లోనే బెస్ట్ ఆల్బమ్ అని చెబుతాను. ఈ సినిమా సక్సెస్ పై నమ్మకం పెరగడానికి మ్యూజిక్ కూడా ఒక కారణమని చెప్పుకోవాలి" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు

  • Loading...

More Telugu News