Mohanlal: గల్ఫ్ దేశాల్లో మోహన్ లాల్ ‘మాన్ స్టర్’పై నిషేధం

  • సినిమాలో ఎల్జీబీటీ కంటెంట్ పై అభ్యంతరం
  • నిషేధ నిర్ణయం తీసుకున్న గల్ఫ్ దేశాలు
  • సెన్సార్ బోర్డు రీ ఎవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న నిర్మాత
Mohanlals Monster banned in Gulf countries due to LGBTQ content

ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మాన్ స్టర్’ సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ లోపే గల్ఫ్ దేశాలు మాన్ స్టర్ ప్రదర్శనపై నిషేధం విధించాయి. ఈ సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీ టీ క్యూ) కంటెంట్ ఉండడంతో నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ 'సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్'కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది.

More Telugu News