అమరావతి రైతుల పాదయాత్రలో వంగవీటి, పరిటాల.. 7 కిలో మీటర్లమేర నడిచిన టీడీపీ నేతలు
- కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం చేరిన అమరావతి రైతుల యాత్ర
- గోదావరి వంతెనపై రైతులతో కలిసి నడిచిన వంగవీటి రాధ, పరిటాల శ్రీరామ్
- అమరావతి రైతు ఉద్యమానికి సాయం అందిస్తామని శ్రీరామ్ ప్రకటన
ఈ సందర్భంగా అమరావతి రైతులకు మద్దతుగా తనతో పాటు వంగవీటి రాధ మద్దతు తెలిపిన విషయాన్ని పరిటాల శ్రీరామ్ స్వయంగా వెల్లడించారు. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకు గోదావరి వంతెనపై సాగిన యాత్రలో తాము పాలుపంచుకున్నామని, రైతుల వెంట తాము 7 కిలో మీటర్లమేర నడిచామని శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా అధికార వికేంద్రీకరణ 3 రాజధానులతో ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని, వారి ఉద్యమానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కూడా శ్రీరామ్ తెలిపారు.