Mohammad Shami: సలహాల కోసం షమీ వద్దకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాన పేసర్... ఫొటోలు ఇవిగో!

Pakistan pacer Shaheen Afridi taken some tips from Team India pace spearhead Mohammad Shami
  • ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
  • సన్నాహాల్లో మునిగితేలుతున్న ప్రధాన జట్లు
  • ప్రాక్టీసు సందర్భంగా షహీన్ అఫ్రిదీకి మెళకువలు చెప్పిన షమీ
టీ20 వరల్డ్ కప్ కోసం ప్రధాన జట్లన్నీ ఆస్ట్రేలియా చేరుకుని సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 23న మెల్బోర్న్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. 

నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్న టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వద్దకు పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ వచ్చాడు. దాయాది బౌలర్ ను షమీ ఉత్సాహంగా పలకరించాడు. ఈ సందర్భంగా షహీన్ అఫ్రిది... షమీని కొన్ని బౌలింగ్ మెళకువల గురించి అడగ్గా, షమీ కాదనకుండా అఫ్రిదీకి సలహాలు ఇవ్వడం సోషల్ మీడియాలో ఫొటోల రూపంలో దర్శనమిస్తోంది. 

వీరే కాదు, పలువురు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ఒకర్నొకరు కలుసుకుని ఉల్లాసంగా ముచ్చటించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పంచుకుంది.
Mohammad Shami
Shaheen Afridi
Pace Bowling
India
Pakistan
T20 World Cup
Australia

More Telugu News